శరీరంలో వణుకు పుట్టించే శీతాకాలపు ఉషోదయవేళ
నిర్మలమైన ఆకాశంలో స్వచ్ఛమైన నీలపురంగుతో ప్రశాంతంగా ఉంది.
పక్షులు కిలకిలమంటూ హాయిగా విహరిస్తున్నాయి.
మంచుకురిసేవేళలో కొత్త సంవత్సరంలో కొత్తబంగారులోకాన్ని చూడడానికి ఉషోదయ భానుని నులి వెచ్చని కిరణాలు చల్లని మంచు పొరలను తునాతునకలు చేసుకుంటూ ఇంద్రధనుస్సు రంగులతో ప్రకృతి అందాన్ని రెట్టింపు చేస్తూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ...!
కొత్త సంవత్సరంలో కొత్త ఆశలతో ,కొత్త ఆలోచనలతో కొత్త బంగారులోకం చూడాలనుకునే అందరికీ ...!
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
గతంలో మంచిని గుర్తూ చేసుకుంటూ చెడును మర్చిపోతూ
అంతా మన మంచి కోసమే జరిగిందని అనుకోని
కొత్త సంవత్సరంలో కొత్త బంగారులోకంలో అందరికీ మంచి జరగాలని
అందరూ మంచి మార్గంలో నడవాలని కోరుకుంటూ...!
గత సంవత్సరం అనివార్య కారణల వల్ల నిలిపిన బ్లాగును కొనసాగిస్తూ...!
మీ
సిరా...!
Wednesday, December 31, 2008
Subscribe to:
Posts (Atom)