Saturday, September 22, 2007

జీవించేకళ

మీ వరకు మీరు నిజాయితీగా ఉండండి మిమ్మల్ని మోసం చేసుకోవద్దు.
సమస్యలను ఎదుర్కొనండి,వాస్తవాలూను ఎదుర్కొన్నప్పుడే విజయం లభిస్తుంది.
చేడు సాంగత్యంలో ఉండడం కంటే ఒంటరిగా ఉండడమే మంచిది.
మీకు ఇస్టమైన దాన్ని అందుకోవదానికి క్ర్షి చేయకపోతె అందుబాటులో ఉన్నదానిని ఇష్టపడాల్సి వస్తుంది.
మీ అభిరుచుల పరిధిని విస్తృతం చేసుకోండి, చదవడం సంభాషణలలో పాల్గొనడం,వినడం ద్వారా మీ మెదడును విస్తరింప చేసౌకోనండి.
మీ సమస్యను ఒక పుస్తకంలో రాసుకోండి సక్రమమైన ప్రణాళిక,స్పష్టమైన ఆలోచనలపై ఆధారపడుతుంది.
మొదట చేయవలసిన పని మేదటే చేయండి అవసరంలేని వాటి గురించి కాకుండా ముఖ్యమైన వాటి గురించి ఆలోచించండి.
సమస్య కఠినంగా ఉండేట్లు చూసుకుంటే దాని గురించిన ఆలోచన పలితాన్ని ఇస్తుంది.
తప్పులు పట్టడం అనే దశను దాటి ముందుకు పోండి.ఏది తప్పో అది ప్రజలకు తెలుసువాటిని గురించిఏం చేయలనుకుంటారో వారు అది చేస్తారు.
పక్షపాతం లెకుండా ఉండడి.ఉత్తమ పరిస్కారం అన్నది మీ పరిస్కారం కాకపోవచ్చును.
అంతరంగ దృర్ష్టిని అలవరచుకోండి. అవతలవారి అభిప్రయాన్ని తెలుసుకోవడానికి వినండి.అంతే కాని అతడు చేప్పింది మాత్రం వినకండి.
సక్రమమైన వాటిపై దృష్తి సారించంది. భగవంతుదు సృష్టికర్త ఆయనను ప్రార్థించండి.అన్ని మంచి విషయాలకు సరైన కోరికలకు న్యామైన కోరికలకు ఆధారం అతడే
.

Tuesday, September 18, 2007

పద తోరణం

బుద్ధిమంతులవడానికి కొన్ని సూచనల
  • ఆకారణ కోపం ఉండకుండుట
  • వ్యర్త ప్రసంగం
  • ఉపయోగం లేని మార్పు
  • సంబంధం లేని పరిశొధన
  • అపరిచితులను నమ్మడం
  • శత్రువులతో సహావాసం
  • పుస్తక పఠనం
  • వివేకతంతో సిద్దపడడం
  • బలమైన సరళ స్వభావం
  • ప్రోత్సాహాన్ని ఇచ్చే పరిశుభ్రత
  • చక్కటి సలహాలను సూచించే శక్తి
  • గెలుపులోని ఆనందం
మేఘం నుంచి వర్షిస్తున్న ఒక చినుకు మహా సముద్రాన్ని చూసి దాని ముందు నేనెంత అనుకుంది.
ఆ వర్షపు చినుకు ముత్యపు చిప్పలోపడి ముత్యం అయ్యింది ఇదే వినయం అనే అత్యుత్తమైన సుగుణం.


Tuesday, September 11, 2007

ప్రపంచ శాంతి

  • విలువల కొరకు విద్య
  • విద్య కొరకు జీవితం
  • జీవితం కొరకు ప్రేమ
  • ప్రేమ కొరకు మనిషి
  • మనిషి కొరకు సేవ
  • సేవ కొరకు శక్తి సామర్థ్యాలు
  • శక్తి సామర్థ్యాల కొరకు జాతి
  • జాతి కొరకు ప్రపంచం
  • ప్రపంచం కొరకు శాంతి

ఎక్కడా బుద్ధి వివేకాలతో కూడిన జ్ఞానంతో నడిచే మనస్సు ఉంటుందో,ఎక్కడ కర్మ సన్యాస మార్గంతో ప్రేమతో జరిగే శారీరిక శ్రమ ఉంటుందో అక్కడ వైభవం,విజయంధర్మ ప్రవర్తన కొలువుదీరి మనస్సును నిర్మలంగా ఆనందంగా ఉంచుతాయి.అణుబాంబు తయారు చేయవలసిందని అమెరికా అధ్యక్షుడు రూజ్ వెల్ట్‌కు సలహానిస్తు రాసిన లేఖపై సంతకం చేసి మహా తప్పిదం చేశానని ఐన్ స్టీన్ చనిపోవడానికి కొద్ది రోజుల ముందు అన్నాడు.ఐన్ స్తీన్ కనిపెట్టిన కొన్ని సిద్ధంతాలు అణుబాంబు నిర్మాణానికి దారితీశాయి.మరొక ప్రపంచయుద్ధం అంటూ వస్తే రాళ్ళే అయుధాలుగా మిగులుతాయి అని ఆయన చాలా బాధపడ్డాడు.కాబట్టి మనమంతా ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తాం .