Saturday, January 3, 2009

అనవసరాలు

ప్రేమికుడు తోడు ఉన్న మాట్లాడకపోతే ఉన్నా ఫలం లేదు .
ఆరోగ్యానికి హానికరం అని చెపుతూ ధూమపాన సంబంధ వస్తువులు తయారు చేస్తే ఏం లాభం లేదు.
సినిమాలు చూస్తూ జనాలు చెడిపోతున్నారు అంటూ మంచి సినిమాలు తీయకపోతే ఏం లాభం లేదు.
దొంగ చెట్టు ఎక్కి టెంకాయలు కొయాలనుకున్నాడు.దొంగ చెట్టు ఎక్కింది టెంకాయల కొసమే కాని అంతలో యజమాని లేచి ఏం వెంకయ్య ఏం చేస్తూన్నావు,అంటే ఆవు దూడ గడ్డి కోసం అన్నాడు.ఆవు దూడ గడ్డి టెంకాయ చెట్టు మీద దొరకదు కదా...!వాడ్ని కిందికి దింపి తరుముకోవడం న్యాయమే కదా...!
ఏ పని అయినా ఆలోచించకుండా చేస్తే ఇలాగే అవుతుంది.
కాబట్టి ఏ పని అయినా సృజనాత్మకంగా చేయాలి .

లంచం

చదువుకోని వ్యక్తి చెప్పిన పనిని సక్రమంగా చేస్తే ,

అదే పనిని చేయడానికి చదువుకున్న వ్యక్తి లంచం అడుగుతున్నాడు .

లంచం తీసుకోని కూడా ఆ పనిని అంకితభావంతో చేయ్యడు.

ఈవ్యవస్థ ఆ విధంగా తయారైంది.

అందుకే పెద్దలు అంటారు చదువుకున్నొడి కన్నా చాకలోడు మేలని.

ఈవాక్యాలు లంచం తీసుకుంటున్న చదువుకున్న వ్యక్తులకే.

Wednesday, December 31, 2008

శుభాకాంక్షలు

శరీరంలో వణుకు పుట్టించే శీతాకాలపు ఉషోదయవేళ
నిర్మలమైన ఆకాశంలో స్వచ్ఛమైన నీలపురంగుతో ప్రశాంతంగా ఉంది.
పక్షులు కిలకిలమంటూ హాయిగా విహరిస్తున్నాయి.
మంచుకురిసేవేళలో కొత్త సంవత్సరంలో కొత్తబంగారులోకాన్ని చూడడానికి ఉషోదయ భానుని నులి వెచ్చని కిరణాలు చల్లని మంచు పొరలను తునాతునకలు చేసుకుంటూ ఇంద్రధనుస్సు రంగులతో ప్రకృతి అందాన్ని రెట్టింపు చేస్తూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ...!
కొత్త సంవత్సరంలో కొత్త ఆశలతో ,కొత్త ఆలోచనలతో కొత్త బంగారులోకం చూడాలనుకునే అందరికీ ...!
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
గతంలో మంచిని గుర్తూ చేసుకుంటూ చెడును మర్చిపోతూ
అంతా మన మంచి కోసమే జరిగిందని అనుకోని
కొత్త సంవత్సరంలో కొత్త బంగారులోకంలో అందరికీ మంచి జరగాలని
అందరూ మంచి మార్గంలో నడవాలని కోరుకుంటూ...!
గత సంవత్సరం అనివార్య కారణల వల్ల నిలిపిన బ్లాగును కొనసాగిస్తూ...!
మీ
సిరా...!

Wednesday, December 12, 2007

ఇంద్రధనుస్సు

మేఘాకాశం తామసంగా ఉంది.
తామస మేఘాలు పడదామా వద్దా అని ఆలోచిస్తుంటే
నువ్వు పడకపోతే నే పడతానంటు సూర్యుడు పైకి వస్తే
నువ్వు వస్తే నే పడతానంటు వర్షం పోటికి వస్తే
ఆపోటికి ఫలితంగా మేఘాకాశంలో ఇంద్రధనుస్సు వెలిసింది.
మనసులో ఆనందం కలిగింది.

Sunday, December 9, 2007

ఏకాగ్రత

ప్రతి పనికి ఒకప్రారంభం.
ఆ పనిని పుర్తి చేయడానికి కొంత ప్రయత్నం.
ఆ ప్రయత్నం ఫలించడానికి ఏకాగ్రత కావాలి.
ఏకాగ్రత కావలంటే విద్య కావాలి.
విద్య కన్నా శ్రద్ధ ముఖ్యమైంది.
శ్రద్ధ లేని విద్య నిష్ప్రయోజనం.
కర్మ శరీరం నుండి,
తెలివి బుద్ధి నుండి,
శ్రద్ధ హృదయం నుండి ఉత్పన్నమవుతాయి.
శ్రద్ధ ఉంటే ఏ రంగమైన విజయం లభిస్తుంది.
జీవితం ఒక నిరంతర పోరాటం ,గెలుపుకు బానిసలు కాకుండా ఓటమికి బాధపడకుండా ముందుకు ఏకాగ్రతతో సాగిపోవాలి.శ్రీకృష్ణుడు భగవద్గీతలో చేయాల్సింది శత్రు సంహారమైనా ప్రశాంతంగా ఏకాగ్రతతో చేయాలంటాదు.

ఆలోచించండి

సినిమాలు చూసి జనాలు చెడిపోతున్నారు,అనే బదులు మంచి సినిమాలు తీస్తే సరిపోదు.
ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు లేరు అనకపొతే ప్రైవేటు పాఠశాలలకు అనుమతి ఇవ్వకపోతే సరిపోతుంది కదా.
మతాలు,కులాలు పేర్లు చెప్పి కుమ్ములులాటలు జరుగుతుంటే వాటిని లేకుండానే చేస్తే సరిపోతుంది కదా.
ఆరోగ్యానికి హానికరం అని చేప్తూ సిగరెట్లు ఉత్పత్తి చేసేవారికి అనుమతి ఇవ్వడం ఎందుకో ఆలోచించరు.

Wednesday, November 7, 2007

తిన్నామా... పడుకున్నామ... తెల్లారిందా

ప్రతి వ్యక్తి జీవితంలో తిన్నామా
పడుకున్నామా తెల్లారిందా అనే విధంగా కాకుండా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని
దాని
కోసం కృషి చేయాలి. జనమందరిలో మనమేవరమో తెలిసుండాలి...మనకు తగు
ప్లేసుండాలి... అనే
కోరిక ఉండాలి.అందరిలో ఒకరిలా కాకుండా అందరికి ఒక్కడిలా
ఉండాలనే తపన ఉండాలి.చేసేది
శత్రు సంహారమైన తొందర పడకుండా నింపాదిగా చేయాలని
గీతలో శ్రీ క్రిష్ణుడు
చెప్పాడు