Sunday, October 28, 2007

సేవా గుణం

ఒక నాడు వేసవి ఒక ఇంట్లో అందరు నిద్ర పోతున్నారు అతనికి చెమటవల్ల,వేడివల్ల నిద్ర రాలేదు. మిగతా వారంతా చెమట కారుతున్న నిద్రపోతున్నారు.అతను విసనకర్ర తీసుకోని వారందరికి గాలి తగిలేలా విసరడం మొదలుపెట్టాడు.అందరు కదలకుందా నిద్ర పోయారు.కొద్ది సేపటికి అతని శరీరం చల్లగా తయారయ్యింది. అది అంతా దైవ కృప అనుకున్నాడతను.

గురువు

ఒక చెడ్డ గురువు ఫిర్యాదు చేస్తాడు.
ఒక నిర్దడైన గురువు తెలియజేస్తాడు.
ఒక సాధరణ గురువు వివరిస్తాడు.
ఒక మంచి గురువు చేసి చూపిస్తాడు.
అయితే ఒక గొప్ప గురువు ప్రేరిపిస్తాడు.
గొప్ప గురువుకి అతని విచక్షణే అతనికి ఉపాధ్యాయుడుగా ఉండాలి.అప్పుడే అతని మాటలకి చేతలకి చేతలకి మాటలకి పొంతన ఉంటుంది.ఇవ్వగలిగిన వాడే భోదిస్తాడు భోధన అంటే మాట్లాడడంకాదు అవి పరస్పరభావవినిమయం. ఆధ్యాపకులు,విధ్యార్థులకు విద్యను మనస్సులకు వినుల వింపుగానో వ్యక్తిత్వాన్ని సంపన్నం చేసేదిగా ఉండాలి.అంతే కాని అధ్యాపకుని పుస్తకంలోనించి విధ్యార్తి పుస్తకంలోకి నింపడం కాదు. దురదృష్టవశాత్తు అలా ఇప్పుడు జరుగుతుంది.

Saturday, October 27, 2007

జీవితంలో సంతోషాన్ని కలిగించే కొన్ని అనుభవాలు అనుభూతులు

  • చిన్న చిన్న తప్పులకు నాన్న చేతిలో తన్నులు తినడం.
  • నాన్నను ఊరి వెంబడి పరుగెత్తించడం.
  • స్నేహితులతో మొదటిసారి ఈతకు వెళ్ళడం.
  • స్నేహితులకు చాంతాడంత ఉత్తరం రాయడం.
  • చలికాలం ఉదయాన్నే ఐస్ క్రీం తినడం.
  • మొదటిసారి కాలేజీలో సారు పొగడడం.
  • స్నేహితులను ఇంటికి పిలిచి వంట చేసి పెట్టడం.
  • చిన్నప్పుడు పుస్తకాలలో నెమ్లీకలు దాచుకోవడం.
  • పక్క ఊరీలో ఆర్కెస్ట్రా కోసం మూడు కిలోమీటర్లు నడిచిపోవడం.
  • అర్దరాత్రి సినిమాకు వెళ్ళి వస్తుంటే కుక్కలు వెంటపడడం.
  • రొడ్డు దాటలేని అవ్వను రొడ్డు దాటించడం.
  • స్నేహిలతోకలసి కొండ గుట్టలు ఎక్కినప్పుడు కాళ్ళనొప్పులు రావడం.
  • ఒకటవ తరగతి మాష్టారు గారి తల పగులకొట్టడం.
  • ఆత్మహత్య చేసుకోవాలని చిన్నప్పుడు అంపించడం.

రహస్యం

పురిటి నుండి శ్మశానం దాకా
బిడ్డ నుండి ముదుసలి దాకా
నీటి చుక్క నుండి సముద్రం దాకా
మేఘం నుండి తుఫాను దాకా
గ్రామం నుండి ప్రపంచం దాకా
భూమి నుండి ఆకాశం దాకా
వీటిలో మొదటి నుండి చివర వరకు సృష్టించింది దేవుడే. కాని మానవుడు మధ్యలో జీవితాన్ని
సాఫిగా గడపకుండా అనేక రకాలైన చెడు కార్యాలు చేసి చివరి దానికి చాలా దగ్గరవుతున్నాడు.