Wednesday, December 12, 2007

ఇంద్రధనుస్సు

మేఘాకాశం తామసంగా ఉంది.
తామస మేఘాలు పడదామా వద్దా అని ఆలోచిస్తుంటే
నువ్వు పడకపోతే నే పడతానంటు సూర్యుడు పైకి వస్తే
నువ్వు వస్తే నే పడతానంటు వర్షం పోటికి వస్తే
ఆపోటికి ఫలితంగా మేఘాకాశంలో ఇంద్రధనుస్సు వెలిసింది.
మనసులో ఆనందం కలిగింది.

Sunday, December 9, 2007

ఏకాగ్రత

ప్రతి పనికి ఒకప్రారంభం.
ఆ పనిని పుర్తి చేయడానికి కొంత ప్రయత్నం.
ఆ ప్రయత్నం ఫలించడానికి ఏకాగ్రత కావాలి.
ఏకాగ్రత కావలంటే విద్య కావాలి.
విద్య కన్నా శ్రద్ధ ముఖ్యమైంది.
శ్రద్ధ లేని విద్య నిష్ప్రయోజనం.
కర్మ శరీరం నుండి,
తెలివి బుద్ధి నుండి,
శ్రద్ధ హృదయం నుండి ఉత్పన్నమవుతాయి.
శ్రద్ధ ఉంటే ఏ రంగమైన విజయం లభిస్తుంది.
జీవితం ఒక నిరంతర పోరాటం ,గెలుపుకు బానిసలు కాకుండా ఓటమికి బాధపడకుండా ముందుకు ఏకాగ్రతతో సాగిపోవాలి.శ్రీకృష్ణుడు భగవద్గీతలో చేయాల్సింది శత్రు సంహారమైనా ప్రశాంతంగా ఏకాగ్రతతో చేయాలంటాదు.

ఆలోచించండి

సినిమాలు చూసి జనాలు చెడిపోతున్నారు,అనే బదులు మంచి సినిమాలు తీస్తే సరిపోదు.
ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు లేరు అనకపొతే ప్రైవేటు పాఠశాలలకు అనుమతి ఇవ్వకపోతే సరిపోతుంది కదా.
మతాలు,కులాలు పేర్లు చెప్పి కుమ్ములులాటలు జరుగుతుంటే వాటిని లేకుండానే చేస్తే సరిపోతుంది కదా.
ఆరోగ్యానికి హానికరం అని చేప్తూ సిగరెట్లు ఉత్పత్తి చేసేవారికి అనుమతి ఇవ్వడం ఎందుకో ఆలోచించరు.