Wednesday, November 7, 2007

వర్షం కురిసిన రాత్రి

అవి మేము కాలేజి చదువుతున్న రోజులు బయట రూంలో ఉంటూ చదువుతున్నాము. ఒక రోజు పక్క ఊరిలో గానకచేరి ఉందని తెలిసి ఐదు మందిమి కలసి వెళ్ళాము.వెళ్ళిన అందరు గానకచేరి చూస్తూన్నారు నాకు ఎందుకో నచ్చలేదు, వెనక్కి వెళ్ళాలనిపించింది. అందరిని అడిగాను వాళ్ళు పలకలేదు, దాంతో నేను మాత్రమే బయలుదేరాను.వారికి వెళ్ళుతున్నానని చెప్పి నడవడం మొదలుపెట్టాను. ఆ ఊరి నుండి రూంకు రావలంటే మూడు కిలోమీటర్ళు వంతెన ఉంది దాన్ని దాటి రూంకు రావాలి.నేను నిదానంగా నడుస్తున్నాను.వంతెన దగ్గరికొచ్చాను.ఇంతలో అకస్మాత్తుగా అకాశంలో ఉరుములు మెరుపులు రావడం మొదలైంది వర్షం పడుతుందేమోనని భయం వేసింది. అనుకున్నట్లుగానే చిన్న చిన్న చినుకులతో వర్షం మొదలైంది కొద్దిసేపటికి వర్షం పెద్దదైంది.నేను దగ్గరలో ఉన్న చింత చేట్టు క్రిందకు చేరానువర్షం చాలా పెద్దదైంది. ఇంతలో చింత చెట్టు మీద నుంచి ఎవో శబ్దాలు మొదలైయ్యాయి,భయపడుతూ పైకి చూశాను. పైన తెల్ల చీర కట్టుకొని జుట్టు విరబూసుకొని ఎదో ఆకారం కనిపించింది. ఆ ఆకారం మెల్లగా కిందకు దిగుతూ నన్ను సమీపించ సాగింది. నేను భయంతో కల్లు మూసుకున్నాను ,అంతే ఆతర్వాత కల్లు తెరిచేసరికి ఆకాశంలో తేలుతున్నాను.నా పక్కన అందమైన అమ్మాయి నా చెయ్యి పట్టుకొని పైకి తీసుకెళ్ళింది.చాలా అనందం కలిగింది,అంతలో అకస్మాత్తుగా ఆ అమ్మాయి మాయమైంది.నా ఆశలన్ని ఆవిరి అయ్యాయి అనుకుంటుండగా నేను చాలా వేగంగా కిందకు పడుతున్నాను అది గమనించ లేదు వేగంగా క్రింద పడ్డాను.కళ్ళు తెరిచి చూసేసరికి స్నేహితుడు తిడుతున్నాడు అర్థం కాలేదు. కళ్ళు పులుముకుని చూస్తే కలగంటు మంచంలోనించి స్నేహితుని మీద పడ్డానని అర్థమైంది.

1 comment:

rākeśvara said...

ఫ్రాయిడ్ ని అడిగితే మీరు వెంటనే పెళ్లి చేసుకోవాలి అంటాడు. :)
క్రింద పడిపోతున్నామనే కలలకు ఎదో అర్థం వుందండి, మరచిపోయాను!